ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి వేదికగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. ఐపీఎల్‌లో ఈ ఇరు జట్లు మొత్తం 35 సార్లు తలపడగా.. అందులో KKRదే పైచేయిగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీ ఒకసారి కేకేఆర్‌ను చిత్తుచేసింది.