AP: రాష్ట్రంలో 50 చోట్ల రూ.50 కోట్లతో ఎకో టూరిజం డెవలప్ చేసి 4 వేల ఉద్యోగాలు కల్పిస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి తెలిపారు. ఈ శాఖలోని ఖాళీలను వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని చెప్పారు. APPSC ద్వారా రేంజి, సెక్షన్, బీట్ అధికారుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అటవీ శాఖ పట్టుకున్న 905 MT ఎర్రచందనాన్ని త్వరలో విక్రయిస్తామని, రూ.350 కోట్ల ఆదాయం వస్తుందని వివరించారు.