వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్, సెజ్‌లో వాటాలు బలవంతంగా లాక్కున్న కేసులో విక్రాంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కస్టోడియల్ ఇంటరాగేషన్‌లో విక్రాంత్ రెడ్డిని ప్రశ్నించాలని సీఐడీ హైకోర్టును కోరింది. విక్రాంత్ తండ్రి వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సాక్షులను బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సీఐడీ కోరింది.