తుర్కిష్ బ్రాండ్లను నిషేధించాలన్న ప్రచారం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. తాజాగా రిలయన్స్‌కు చెందిన అజియో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో తుర్కియే బ్రాండ్ల విక్రయాలను నిలిపివేసింది. అదే విధంగా మింత్రా కూడా తుర్కియే తయారు చేసే వస్త్రాలను విక్రయించేందుకు నిరాకరించింది. ఇప్పటికే భారత విమానాశ్రయాల్లో భద్రతా సేవలు అందిస్తున్న తుర్కియే సంస్థ సెలెబి ఏవియేషన్‌కు కేంద్రం సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసింది.