AP: ఈ నెల 21న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో ‘యోగా సంగమం’ పేరుతో అంతర్జాతీయ యోగా కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్‌కు 5 లక్షల మంది ప్రజలు, 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు. కాగా, ప్రధాని మోదీ ఆ రోజు ఉ.6.30-7.00 గంటల మధ్య జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 7 నుంచి 7.45 వరకు యోగాభ్యాసం సాగుతుంది. ఇందులో 19-20 యోగాసనాలు చేస్తారు.