AP: జూన్ నుంచి అన్ని వసతి గృహాలకు సన్నబియ్యం అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బిసి వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను ఆమె గురువారం అందజేశారు.