ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రిక్కీ కేజ్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అరుదైన ఘనత సాధించారు. ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి మన దేశ జాతీయ గీతాన్ని వైవిధ్యభరితంగా ఆలపించి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక వేణుగాన విద్వాంసులు హరి ప్రసాద్ చౌరాసియా, రాకేశ్, వీణ మాస్ట్రో జయంతి తదితరులు ఇందులో భాగమయ్యారు.