ఏపీలో ఎన్నికల తర్వాత చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీతో సమీక్ష నిర్వహించిన కేం
ద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలకు దిగింది. ఎన్నికల
ఫలితాలు విడుదలైన 15 రోజుల వరకూ రాష్ట్రంలో కేంద్రబలగాలను కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది.