ఢిల్లీ ప్రీమియర్ లీగ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎడిషన్లో భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ బరిలోకి దిగుతాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. డీపీఎల్లో అన్ని మ్యాచుల్లో కాకపోయినా కొన్నింట్లో ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ”రిషభ్ పంత్ డీపీఎల్ టీ20 లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు అంగీకరించాడు. ఢిల్లీ కుర్రాళ్లకు గొప్ప వేదికగా నిలబోయే ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు ముందడుగు వేయడం అభినందనీయం" అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.