AP: చిత్తూరు జిల్లాలోని పుంగనూరు (M) సుగాలిమిట్టలో లారీ ఢీకొని టీచర్ మృతి చెందింది. వివరాలు ప్రకారం.. కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లికి చెందిన Y. వెంకటరమణ, అతని భార్య శారద (40) ములకలచెరువులోని ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్లుగా పని చేస్తున్నారు. ఆదివారం కుమార్తె కీర్తి(17)తో కలిసి కారులో పుంగనూరు వైపు వెళుతుండగా, సుగాలిమిట్టలో లారీ ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా.. శారద మృతి చెందింది.