ఐఐటీ ఖరగ్‌పూర్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పంట రోగాలను గుర్తించే రోబోలను తయారు చేశారు. దీంతో వెంటనే రోగాలను గుర్తించి పంటకు సరైన మందులను పిచ్చికారి చేస్తుంది. అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించుకోవచ్చు. ప్రొఫెసర్ దిలీప్ కుమార్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ స్కాలర్స్ ఈ పరిశోధన చేసి విజయం సాధించారు. అలాగే అన్ని వ్యవసాయ భూములకు అనువుగా ఉండేలా ట్రాక్ట్ మొబైల్ మాడ్యులేషన్ సిస్టమ్‌తో దీనిని తయారు చేశారు.