T20 WC గెలిచిన తర్వాత తొలిసారి మైదానంలోకి దిగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ స్పెషల్ వీడియోను BCCI విడుదల చేసింది. 'ఆ నెలంతా ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో మధురానుభూతులు. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి' అని అన్నారు. 'ఇప్పటికీ పొట్టి ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమవ్వాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఇది ముందుకు వెళ్లాల్సిన సమయం' అంటూ కొత్త కోచ్ నేతృత్వంలో లంకతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ చెప్పుకొచ్చారు.