ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు అవుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పలువురు ప్రముఖులు ఇక్కడకు వస్తూ.. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వచ్చారు. ఈరోజు ఉదయమే అక్కడకు చేరుకున్న ఆమె.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఆపై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.