సీఎం చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. 'లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. పీఎంకి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతిలో తయారు చేసిన లడ్డూ అని సీఎం అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారం చేస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసే వారు కాబట్టే కల్తీ ప్రచారాన్ని నమ్మకున్నారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.