AP: వైసీపీ మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని, వైసీపీలో ఉన్న ప్రతి మహిళా ఒక సత్యభామ లాగా నారావారి నరకాసుర పాలనను ముగించడానికి నడుం బిగించాంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకాలు, అత్యాచారాలు, అవమానాలు, అగత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్‌లంటూ పేర్కొన్నారు. సొంత పార్టీవాళ్లనే కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.