తిరుమల ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు వైజాగ్‌కు చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు భారీ విరాళం అందజేశారు. శనివారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి రూ.కోటి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతకు బీఆర్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.