వారి వివాహానికి రూ.10 లక్షల సహాయం: అదానీ

82చూసినవారు
ప్రముఖ వ్యాపారవేత్త అదానీ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. తన కుమారుడు జీత్, కోడలు దివాలు పెళ్లి ఫిబ్రవరి 7న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు 'మంగళ సేవా' కార్యక్రమంలో ఓ ప్రతిజ్ఞ చేసినట్లు గౌతమ్ అదానీ వెల్లడించారు. ప్రతి ఏటా 500 మంది దివ్యాంగ మహిళల వివాహానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అదానీ తన X ట్వీట్ ద్వారా తెలిపారు. కుమారుడి వివాహాన్ని ఏలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్