పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11లక్షలు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్‌లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని బెదిరించారు. అరెస్టు చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఆమెను ఫోన్‌లో భయపెట్టారు. దీంతో భయపడిన ఉద్యోగిని ఆన్‌లైన్‌లో రూ.11 లక్షలు చెల్లించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.