AP: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. టీడీపీ పొలిట్ బ్యూరో బుధవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12న రైతుల ఖాతాల్లో రూ.20 వేలు నగదు జమ చేస్తున్నట్లు తెలిపింది. కేంద్రం అందించే నగదుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదును కూడా ఒకే విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.20 వేలు జమ చేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.