AP: మత్స్యకారులకు వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న వారి ఖాతాల్లో రూ.20,000 చొప్పున జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శుక్రవారం ONGC పైపులైన్ వల్ల నష్టపోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల మత్స్యకారులకు ఆ సంస్థ విడుదల చేసిన నష్టపరిహారాన్ని 23,450 మందికి రూ.63,200 చొప్పున పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.