నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో రూ.4.5 కోట్లతో వెళ్లిన కారు కలకలం సృష్టించింది. ఢిల్లీ నుంచి చెన్నైకి డబ్బు తరలించేందుకు వ్యాపారి పంపిన కారులోని GPRS సిగ్నల్ కట్ కావడంతో, డ్రైవర్, గుమస్తా ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మర్రిపాడు పోలీసులు కారును గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.