AP: ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గన్నవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి శుక్రవారం విజయవాడ సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొట్టి కార్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు కార్లు, కొన్ని బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.