తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు మండలం బూధనం టోల్‌ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.