బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో దర్యాప్తును ముంబయి పోలీసులు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఐడెంటిఫికేషన్ పరేడ్ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను సైఫ్ అలీఖాన్ ఇంటి సిబ్బంది గుర్తించారు.సైఫ్‌పై దాడి చేసింది అతడేనని నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.