AP: వైసీపీ నేత సజ్జలపై నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "అచ్చోసిన ఆంబోతులా..సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచం అన్నారు. 11 స్థానాలతో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదన్నారు. రాజకీయ అర్భకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని తక్షణమే రాష్ట్ర బహిష్కరణ చేయాలి. అలా చేస్తే రాష్ట్రానికి అత్యంత శ్రేయస్కరం” అని కోటం రెడ్డి 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.