AP: తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరాయి. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమకావడం ప్రారంభమైందని ప్రభుత్వం పేర్కొంది. 35,44,459 మంది తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున విడుదల చేసింది. ఇందులో రూ.13వేలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమచేస్తారు.