‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాలలో జమయ్యే రూ.15 వేలల్లో రూ.2 వేలు తన ఖాతాలోకి వెళ్లాయని వైసీపీ అధికారికంగా ట్వీట్ చేయడాన్ని మంత్రి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణకు సాక్ష్యాలు చూపాలని, లేదంటే ట్వీట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం 24 గంటల గడువు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలకు ప్రభుత్వం తలవంచదని అన్నారు.