AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే (జూన్)లోగా ‘తల్లికి వందనం’ అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎంత మంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తారు.