AP: తిరుమల వెంకటేశ్వరస్వామికి ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా శుక్రవారం భారీ విరాళాన్ని అందజేశారు. సుమారు రూ.10 కోట్ల విలువగల బంగారు శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాల ఆభరణాలను ఆలయ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనను సన్మానించి, స్వామి తీర్థ, ప్రసాదాలు అందించారు.