నన్ను కాపాడండి.. మలేషియాలో ఏపీ వ్యక్తి ఆవేదన (వీడియో)

78చూసినవారు
ఏజెంట్ల చేతిలో మోసపోయి ఏపీకి చెందిన పలువురు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీడియోల రూపంలో తమ ఆవేదనను తెలుపుతూ కాపాడమని కోరుతున్నారు. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోనసీమ జిల్లాకు చెందిన రాంబాబు మట్టా మలేషియాకు పని కోసం వెళ్లాడు. రోజూ 12 గంటలు పని చేస్తున్నానని, సెలవులు ఇవ్వట్లేదని ఆరోపించాడు. ఇండియాకు వెళ్లిపోతానంటే డబ్బులు కట్టమంటున్నారని, తనకు సాయం చేయాలని వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్