AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి డోలా వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ -1లో 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్- 2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కూడా నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.