ఏపీలో ప్రతి నెలా పథకాలు అందేలా ఏడాది సంక్షేమ క్యాలెండర్‌

68చూసినవారు
ఏపీలో ప్రతి నెలా పథకాలు అందేలా ఏడాది సంక్షేమ క్యాలెండర్‌
AP: ప్రతి నెలా సంక్షేమం అందేలా ఏడాది సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. దీపం పథకంలో సిలిండర్‌ బుకింగ్‌కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని, సిలిండర్‌ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. జూన్‌12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2 నెలల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్