స్వీడన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒరెబ్రో నగరంలోని ఓ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో కాల్పులు జరపగా 10 మంది చనిపోయారు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.