బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో దానా తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం అలర్ట్ అయింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలను అక్టోబర్ 23 నుంచి 25 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తుపాన్ ప్రభావం ఏపీపై కూడా ఉంది. తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన ఉత్తర కోస్తా జిల్లాల్లోని స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.