AP: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐవీఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని, ఏ అంశంపైన అయినా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్లపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాల్లో మార్పులు చేస్తామన్నారు. ఇసుక, మద్యం పాలసీపై అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.