సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

61చూసినవారు
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్
AP: విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్ పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా సీఎంతో పోరాడుతున్నానని లోకేశ్ చెప్పుకొచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్