వైసీపీకి 2024 ఎన్నికల్లో గెలిచిందే 11 మంది. అందులో కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి YCP కార్యక్రమాలలో కనిపించడం లేదన్న విమర్శలు సొంత పార్టీ వారే చేస్తునారు. ఆయన అధికార పార్టీ పట్ల సానుకూలంగా ఉండడం వల్లనే ఈ విధంగా చేస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే నాగిరెడ్డి రాజకీయం మొదలైందే టీడీపీ నుంచి కాబట్టి ఆయన మళ్లీ ఆ పార్టీలోకే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.