AP: పల్నాడు జిల్లా, నరసరావుపేట మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావు (30)కి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ నేతి సత్యశ్రీ తీర్పు ఇచ్చారు. నరసరావుపేటలో 2023 మే 5న సలీమా అనే మహిళను నిందితుడైన అంకమ్మరావు దారుణంగా చంపాడు. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.