ఏపీలో వరుస ప్రమాదాలు.. నలుగురు మృతి

55చూసినవారు
ఏపీలో వరుస ప్రమాదాలు.. నలుగురు మృతి
ఏపీలో బుధవారం వేర్వేరు చోట జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గిలేటిపల్లె వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీశ్, మౌలా మృతి చెందారు. అలాగే ప.గో. జిల్లా మొగల్తూరు వద్ద జాతీయ రహదారి పక్కన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్