వైఎస్ జగన్ పై.. షర్మిల మరో సంచలన ట్వీట్!

82చూసినవారు
వైఎస్ జగన్ పై.. షర్మిల మరో సంచలన ట్వీట్!
AP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొనియాడారు. ఏపీలో కూడా కులగణన చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ సీఎం జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు రాకుండా కుట్ర చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్