AP: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70కి.మీ సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. 50 కి.మీ దూరంలో ఒక పోర్ట్ లేదా షిప్పింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుగరాజపట్నంలోదుగ్గరాజుపట్నంలో రూ.3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పనిచేయనుంది. సముద్ర తీరంలో సంపదను సృష్టించడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది.