సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు మరో బిగ్ షాక్ తగలనుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి జనసేన పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రాజేశ్వరి ఓటమి పాలయ్యారు. ఈ సారి జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో పార్టీకి దూరంగా ఉంటున్న రాజేశ్వరి.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గంటావారిపాలెంలో సీఎం జగన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకోనున్నారు.