అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు షాక్ తగిలింది. ఇటీవల జరిగిన రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌లో సభ్యులకు ఖరీదైన కానుకలు ఇవ్వడంపై బిహార్ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సుదామ్ ప్రసాద్ ఎదురు తిరిగారు. సభ్యులకు ఇచ్చిన కానుకల్లో ఒక గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉండటంపై ఆయన ఎంపీ రమేశ్‌కు లేఖ రాశారు. ప్రజాధనాన్ని ఇలా దుబరా చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనాలు సృష్టిస్తోంది.