టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రాకు గాయమైంది. మ్యాచ్ మధ్యలో ఆయన ప్రాక్టీస్ జెర్సీ ధరించి సహాయక సిబ్బందితో కలిసి ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకునేందుకు వెళ్లారు. వికెట్లు తీసేందుకు భారత్ పూర్తిగా బుమ్రాపైనే ఆధారపడిన నేపథ్యంలో ఈ న్యూస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.