ఫిబ్రవరి నెలలో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు గురువారం కూడా స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి తులం బంగారం రూ.79,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగి తులం బంగారం రూ.86,510కు చేరింది. అయితే కొద్దిరోజుల్లో తులం బంగారం రూ.1 లక్షకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.