గుంటూరు జిల్లా కారాగారం వద్ద బుధవారం జగన్‌తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె వివరణ ఆధారంగా కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జైలులో ఉన్న నందిగం సురేష్‌ను పరామర్శించి వెలుపలకు వచ్చిన జగన్‌తో కానిస్టేబుల్ ఆయేషాబాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.