AP: అరచేతిలో వైకుంఠం చూపించడం సీఎం చంద్రబాబు తెలిసిన విద్య అంటూ APCC చీఫ్ షర్మిల విమర్శించారు. అమరావతి కోసం ప్రభుత్వం మరో 44వేల ఎకరాలను సమీకరించనుందన్న వార్తలపై షర్మిల ఈ మేరకు స్పందిచారు. 'రాజధాని పేరుతో రైతుల భూముల్ని తనవారికి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని చూసే కుట్ర ఇది. 34వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయేలా ఉన్న తాత్కాలిక కట్టడాలు, పాడుబడిన భూములు.. ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం?' అని ప్రశ్నించారు.