చిక్కుల్లో సిద్ధరామయ్య.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి

61చూసినవారు
చిక్కుల్లో సిద్ధరామయ్య.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనున్నారు. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం కర్ణాటక క్యాబినెట్ అత్యవసర సమావేశం జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్