వైసీపీ చేసిన పాపాలు వెంటాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. చేయరాని నేరాలు చేసి.. రాష్ట్రాన్ని దోచుకున్నారు. వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపంగా మారాయి. వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు' అని చంద్రబాబు వైసీపీపై విరుచుకుపడ్డారు.