లిక్కర్‌ స్కామ్‌లో కసిరెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు

63చూసినవారు
లిక్కర్‌ స్కామ్‌లో కసిరెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు
AP: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన సిట్‌ అధికారులు.. కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరించారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్